Sponsored Links:
హైదరాబాద్: ఈ మధ్య సినిమా పరిశ్రమలో ఫేక్ రికార్డులు ప్రకటించుకునే ధోరణి పెరిగి పోయిన సంగతి తెలిసిందే. అదే విధంగా తెలుగు సినిమా వసూళ్లు 100 కోట్ల మార్కును అందుకునే విషయమై కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. తను నటించిన ‘1-నేనొక్కడినే' చిత్రం త్వరలో విడుదలవుతున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ బాబు పై విషయాలపై స్పందించారు.
మల్టీప్లెక్సుల సంఖ్య పెరగడంతో పాటు, సినిమా ప్రేక్షులను ఆకట్టుకునే విధంగా ఉంటే తెలుగు సినిమా తప్పకుండా రూ. 100 కోట్ల మార్కును అందుకుంటుందని మహేష్ బాబు అభిప్రాయ పడ్డారు. అదే విధంగా ఫేక్ రికార్డులపై స్పందిస్తూ....‘సినిమా రికార్డులు అనేవి హెల్తీ వాతావరణంలో ఉండాలి. కానీ కొందరు తప్పుడు రికార్డులతో సినిమాలకు హైప్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రేక్షకులు తెలివైన వారు. ఫేక్ రికార్డులను వారు నమ్మే పరిస్థితి లేదు' అని మహేష్ బాబు వ్యాఖ్యానించారు.
‘1-నేనొక్కడినే' సినిమా గురించి మాట్లాడుతూ.....ఈ సినిమా తన కెరీర్లో ఓ మైల్ స్టోన్ అవుతుందని, సరికొత్త రికార్డులను నెలకొల్పుతుందనే నమ్మకం ఉందని మహేష్ బాబు తెలిపారు. ఇప్పటి వరకు మహేష్ బాబు ‘1-నేనొక్కడినే' విడుదలకు ముందు చేసిన బిజినెస్ పరిశీలిస్తే ఈచిత్రం తప్పకుండా రూ. 100 కోట్ల మార్కును అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
‘1-నేనొక్కడినే' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘1-నేనొక్కడినే' చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రితి సానన్ హీరోయిన్. ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు తనయుడు గౌతం బాలనటుడిగా తెరంగ్రేటం చేస్తున్నాడు. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.
నాణ్యమైన వార్తలను అందిస్తున్న వన్ఇండియా... ఇప్పుడు మీకోసం ఫేస్‌బుక్, ట్విట్టర్ ల ద్వారా మరిన్ని అప్‌డేట్స్
English summary :
Mahesh has also expressed his opinion on fake records of movies. He said, " While gunning for records is good and healthy, in recent times many people were coming up with false records to hype films. That's madness. People are smart these days and they know which movie is doing well and which one is bad. I am confident that '1' will set new records."
Sponsored Links:
0 comments