Sponsored Links:
పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి. . ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఈ మాటే వినిపిస్తుంది. పవన్ అభిమానులందరికీ ఇది పిడుగు లాంటి వార్తే, మొదట్లో దీనిని రూమర్ అని కొట్టి పడేసినా తర్వాత మీడియా చూపించిన సాక్ష్యాలతో అందరూ నమ్మక తప్పలేదు. ఈ పెళ్లి ఎప్పుడో జరిగిన, మీడియా ముందుకి ఇప్పుడే వచ్చింది.
అయితే గతేడాది రేణు దేశాయ్ పవన్ నుంచి విడిపోయి ముంబై వెళ్ళిపోవడానికి అసలు కారణం ఇదేనా? రేణు వెళ్ళిపోవడం వెనుక కారణం ఇదే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె ఈ విషయం బాగా ఇబ్బంది పెట్టడంతో పిల్లలతో సహా ముంబై వెళ్ళిపోయి ఉంటుందని చెప్తున్నారు.
అదీ కాక ఉన్నట్టుండి రేణు దేశాయ్ ఒక నిర్మాణ సంస్థ స్థాపించింది, దీనికి కావలిసిన సొమ్ము కూడా పవన్ కళ్యాణే ఇచ్చాడని వినికిడి. చాలా పెద్ద మొత్తంలో సొమ్ము పవన్ కళ్యాణ్, రేణు కి భరణంగా ఇచ్చాడని మీడియాలో ఒక వార్త తిరుగుతుంది. ఇంతకీ రేణు స్థాపించిన నిర్మాణ సంస్థ, పవన్ కళ్యాణ్ ఇచ్చిన సొమ్ముతోనేనా అన్న అంశం ఆసక్తిగా మారింది.
మరో పక్క పరిశ్రమలో చాలా మంది పెద్దలు తమ వ్యక్తిగత విషయాలని బజారున వేయొద్దని, సినిమా విషయాలలా వీటిని కూడా పబ్లిసిటీ చెయ్యొద్దని చెప్తున్నారు. ఏది ఏమైనా దీనిపై ఇంకా చర్చలు జరగక ముందే పవన్ కళ్యాణ్ నోరు విప్పితే సమస్య ముగిసిపోయే అవకాశం ఉంది. . . మరి మీరేమంటారు.
Sponsored Links:
0 comments