Sponsored Links:
ప్రస్తుతం ఏ నోట విన్నా ఒకటే మాట. . . అదే పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి. . . ఇదే "టాక్ ఆఫ్ ది టాలీవుడ్" గా మారిపోయింది. అందరూ అన్ని విషయాలు పక్కన పెట్టేసి దీని మీదే దృష్టి పెట్టారు.
పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ లో ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, అయితే ఇప్పుడు ఈ మూడో పెళ్లి, పవన్ కెరీర్ కి అడ్డు పడుతుందా అన్న విషయం మాత్రం విశ్లేషకుల బుర్రల్ని తొలిచేస్తుంది. మరో పక్క ఏమి జరిగినా మేము పవన్ కళ్యాణ్ అభిమనులమే అని పవన్ ఫ్యాన్స్ చెప్తున్నారు.
మూడో పెళ్లి అనేది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయం, మేము పవన్ ని స్క్రీన్ మీద చూసి అభిమానించాం అంతేకానీ వ్యక్తిగతంగా ఏదో జరిగిందని మేము పవన్ ని ద్వేషించలేము మరియు మాకు పవనిజం పైన నమ్మకం ఎప్పటికీ తగ్గదు అని అభిమానులు అంటున్నారు. ఇదంతా చూస్తుంటే పవన్ మూడో పెళ్లి, తన కెరీర్ కి ఎటువంటి సమస్యా కాదని తెలుస్తుంది. చూద్దాం ఈ కధ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో.
Sponsored Links:
0 comments